Samantha: సమంత దృష్టిలో సక్సెస్ అంటే ఇదేనట..! 15 d ago

హీరోయిన్ సమంత ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీ (IFFS)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సక్సెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "నా దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రం. ఇతరులు నాకు విజయవంతమైనవని చెప్పే వరకు నేను వేచి ఉండను. సక్సెస్ అంటే మన అభిరుచికి తగ్గట్టుగా జీవించడం, మనకు నచ్చిన విధంగా పనులు చేయడం" అని చెప్పారు. తాజాగా, ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియాలో సిడ్నీ యూనివర్శిటీలో చదువుకోవాలన్న కల నెరవేరలేదన్నారు, సినిమాల్లోకి అడుగుపెట్టడం తన జీవితంలో అద్భుతమైన అనుభవమని ఆమె తెలిపారు.